Friday, March 20, 2026
HomeసినిమాSSMB28: మహేష్‌, థమన్ మధ్య గొడవ..?

SSMB28: మహేష్‌, థమన్ మధ్య గొడవ..?

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్… వీరిద్దరూ కలిసి అతడు, ఖలేజా చిత్రాలు చేయడం.. ఈ రెండు చిత్రాలు ఇద్దరికీ మంచి పేరు తీసుకురావడం తెలిసిందే. ఎప్పటి నుంచో మహేష్‌, త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేస్తే చూడాలని అభిమానులు అనుకున్నారు. ఇప్పటికీ అభిమానుల కోరిక నెరవేరబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని హరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అయితే… ఈ సినిమా అనుకోగానే.. సంగీత దర్శకుడుగా థమన్ పేరు సూచించారు త్రివిక్రమ్. దీనికి మహేష్ బాబు నో చెప్పారట. ఎట్టి పరిస్థితుల్లోనూ థమన్ వద్దు అని చెప్పారట. కారణం ఏంటంటే… సర్కారు వారి పాట సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు కానీ.. ఆశించిన స్థాయిలో మ్యూజిక్ అందించలేదని మహేష్ బాగా ఫీలయ్యారట. అందుకనే త్రివిక్రమ్ థమన్ పేరు చెప్పగానే నో అని చెప్పేసారట. అయితే… త్రివిక్రమ్ మహేష్‌ కి సర్థి చెప్పి ఎలాగోలా ఒప్పించారు. దుబాయ్ లో మహేష్ ఉన్నప్పుడు థమన్ ని తీసుకెళ్లి అంతా సెట్ చేశారు.

ఇప్పుడు సినిమా ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిన తరువాత మళ్లీ మహేష్ కు థమన్ మధ్య‌ కోపం మొదటికి వచ్చిందని తెలుస్తోంది. మేటర్ ఏంటంటే.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయి ఆరు నెలలు అవుతున్నప్పటికీ… ఇప్పటి వరకు ఒక్క ట్యూన్ కూడా వినిపించలేదట.  ఆహా షో, క్రికెట్ పోటీలతో థమన్ బిజీగా ఉన్నారట. క్రికెట్ సంస్థ నుంచి మాంచి రెమ్యూనరేషన్ అందడంతో ఈ సినిమా వర్క్ ని నిర్లక్ష్యం చేశాడని టాక్. మరి… ఈ సినిమా వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో…?   మహేష్‌ ని ఎలా మెప్పిస్తాడో..?  చూడాలి.

Also Read : SSMB28: సంక్రాంతి బరిలో మహేష్ బాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular