Sunday, January 19, 2025
Homeసినిమా‘భగవంత్ కేసరి’ లో అర్జున్ రాంపాల్ పోర్షన్‌ పూర్తి..

‘భగవంత్ కేసరి’ లో అర్జున్ రాంపాల్ పోర్షన్‌ పూర్తి..

బాలకృష్ణ, అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్ ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దసరాకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించేలా షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరుపుకుంటోంది.ఇప్పటికే కీలక సన్నివేశాలను చిత్రీకరించింది యూనిట్. మిగిలినా పార్ట్ ను వేగంగా పూర్తి

ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన యాక్టర్ అర్జున్ రాంపాల్ తన పోర్షన్‌ ని పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రంలో అతని పాత్ర పేరు రాహుల్ సంఘ్వి అని తెలియజేశారు. మేకర్స్ షేర్ చేసిన పోస్టర్లలో అర్జున్ రాంపాల్, బాలకృష్ణ, అనిల్ రావిపూడి ఉన్నారు. దసరాకి సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నందున, అక్టోబర్ 19 నుంచి బిగ్ స్క్రీన్‌లపై అతని ఫెరోషియస్ అవతార్ అలరించబోతుంది.

ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్