Saturday, January 18, 2025
Homeసినిమాసోషియో ఫాంటసీ నేపథ్యంతో ఎంట్రీ ఇస్తున్న 'యక్షిణి'

సోషియో ఫాంటసీ నేపథ్యంతో ఎంట్రీ ఇస్తున్న ‘యక్షిణి’

ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై అన్ని రకాల జోనర్లు పరుగులు పెడుతున్నాయి. ఒక వైపున సస్పెన్స్ .. క్రైమ్ .. హారర్ థ్రిల్లర్ కథలు, మరో వైపున సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో కూడిన కథలు ..ఇంకో వైపున సోషియో ఫాంటసీ కథలు ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు వైపు నుంచి ఇదే జోనర్లో ఒక ఇంట్రెస్టింగ్ సిరీస్ ఆడియన్స్ ను పలకరించడానికి రెడీ అవుతోంది. ఆ వెబ్ సిరీస్ పేరే ‘యక్షిణి’.

‘బాహుబలి’ వంటి భారీ చిత్రాలను నిర్మిస్తూ వచ్చిన ఆర్కా మీడియావారు, ఆ తరువాత ‘పరంపర’ .. ‘పరంపర  2’ వెబ్ సిరీస్ లను నిర్మించారు. ఓటీటీ వైపు నుంచి కూడా తమ బ్యానర్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లారు. ఆ నిర్మాతలే ఇప్పుడు ‘ యక్షిణి’ అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు. వేదిక ప్రధానమైన పాత్రను పోషించిన ఈ వెబ్ సిరీస్ కి తేజ మార్ని దర్శకత్వం వహించాడు. రీసెంటుగా ఆయన నుంచి ‘కోట బొమ్మాళి పీఎస్’ థియేటర్లకు వచ్చింది.

‘యక్షిణి’ అనే ఈ వెబ్ సిరీస్ అడుగడుగునా ఉత్కంఠను పెంచుతూ వెళుతుందని అంటున్నారు. బలమైన కథాకథనాలతో పాటు, విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో మంచు లక్ష్మి .. రాహుల్ విజయ్ .. అజయ్ కనిపించనున్నారు. జూన్ లో ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషలలో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్