Saturday, January 18, 2025
Homeసినిమాఎన్టీఆర్ మూవీ నుంచి ఆలియా త‌ప్పుకుందా?

ఎన్టీఆర్ మూవీ నుంచి ఆలియా త‌ప్పుకుందా?

Alia-NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌దుప‌రి చిత్రాన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో వీరిద్ద‌రూ క‌లిసి జ‌న‌తా గ్యారేజ్ మూవీ చేయ‌డం.. ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డం జ‌రిగింది. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రూ మ‌రో సినిమా చేయాలి అనుకున్నారు. అది ఇప్ప‌టికి సెట్ అయ్యింది. దీంతో ఈ క్రేజీ మూవీ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

అయితే.. ఇందులో ఎన్టీఆర్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టించ‌నుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌లేదు కానీ.. ఆలియా ఈ మూవీలో న‌టించ‌డం అనేది క‌న్ ఫ‌ర్మ్ అని వార్త‌లు వ‌చ్చాయి. ఆమ‌ధ్య గంగూభాయ్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో కూడా ఈ విష‌యం చెప్పింది ఆలియా. అయితే.. ఇప్పుడు ఆలియా పెళ్లి చేసుకోబోతుంది. అందుక‌నే ఈ సినిమా నుంచి త‌ప్పుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఈ వార్త‌ల పై క్లారిటీ రావాల్సివుంది.

Also Read : ఎన్టీఆర్ గురించి ప్ర‌శాంత్ నీల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్