Sunday, January 19, 2025
Homeసినిమావిజ‌య్ ఖుషీ రిలీజ్ డౌట్ ప‌డిందా..?

విజ‌య్ ఖుషీ రిలీజ్ డౌట్ ప‌డిందా..?

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ‘నిన్నుకోరి’, ‘మ‌జిలీ’, ‘ట‌క్ జ‌గ‌దీష్’ చిత్రాల ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ఓ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే.  దీనికి ‘ఖుషీ‘ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  కాశ్మీర్ లో కీల‌క స‌న్నివేశాల‌ను,  తర్వాత హైద‌రాబాద్ లో విజ‌య్, స‌మంత‌లపై ఓ సాంగ్ ను చిత్రీక‌రించారు. ఈ మూవీని డిసెంబ‌ర్ 23న విడుద‌ల చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు.

ఆ డేట్ కు విడదల కావ‌డం క‌ష్టమనే టాక్ వినిపిస్తోంది. కార‌ణం .. విజ‌య్ న‌టించిన ‘లైగ‌ర్’ ఆగ‌ష్టు 25న విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో విజ‌య్ ఫుల్ బిజీగా ఉన్నారు.  మ‌రో  కారణం ఆగ‌ష్టు 1 నుంచి షూటింగులు బంద్… దీనితో ఖుషీ షూటింగ్ కి బ్రేక్ ప‌డింది. మ‌ళ్లీ షూటింగులు స్టార్ట్ చేసిన త‌ర్వాత ఆర్టిస్టుల డేట్స్ సెట్ కావాలంటే  టైమ్ ప‌డుతుంది.

అందుచేత ఖుషీ డిసెంబ‌ర్ 23న రావ‌డం క‌ష్ట‌మే అని ప్ర‌చారం మొద‌లైంది. దీనికి తోడు ఈ మూవీని తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో కూడా రిలీజ్ చేయ‌నున్నారు. అందుచేత ఆ భాష‌ల్లో డ‌బ్బింగ్ వ‌ర్క్ కి కూడా టైమ్ ప‌డుతుంది. మ‌రి.. డిసెంబ‌ర్ డేట్ మిస్ అయితే.. సంక్రాంతికి వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి.. ఖుషీ ఎప్పుడు వ‌స్తుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : పండగ రోజు ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన విజయ్ దేవరకొండ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్