Friday, March 13, 2026
Homeసినిమా'సలార్' పై పెరుగుతున్న ఉత్కంఠ!

‘సలార్’ పై పెరుగుతున్న ఉత్కంఠ!

ప్రభాస్ కథానాయకుడిగా ‘సలార్’ సినిమా విడుదలకి సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్లకు రానుంది. ప్రభాస్ అభిమానులంతా ఆ క్షణం కోసమే వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ .. ప్రశాంత్ నీల్ కి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.  భారీ నిర్మాణ సంస్థ నుంచి వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇక ఈ సినిమా కోసం ఎంచుకున్న తారాగణం కూడా అందరిలో ఆసక్తి పెరగడానికి కారణమైంది.

నిజం చెప్పాలంటే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ చాలా తక్కువనే చెప్పాలి. చాలా వరకూ పోస్టర్ల తోనే సరిపెట్టారని అనాలి. షూటింగ్ సమయం నుంచి కూడా కథకి సంబంధించి గోప్యతను పాటిస్తూ వచ్చారు. బొగ్గు గనుల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని మాత్రమే చాలామందికి తెలుసు. అంతకు మించి ఎవరికీ తెలియదు. ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోంది? ఎవరితో తలపడనుంది? అనే ప్రశ్నలు అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి.

చాలా గ్యాప్ తరువాత ప్రభాస్ చేసిన మాస్ యాక్షన్ మూవీగానే ప్రేక్షకులు ఈ సినిమాను భావించారు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ .. ఇది ఒక ఎమోషనల్ డ్రామా అంటున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ మార్క్ సినిమాలు ఎలా ఉంటాయనేది తెలుసు గనుక, కంటెంట్ విషయంలో బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదనే అనుకోవాలి. అంతకంతకూ ఉత్కంఠను పెంచుతూ వెళుతున్న ఈ సినిమా, ఓపెనింగ్స్ తోనే రికార్డుల వేట మొదలుపెట్టేలా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular