Monday, January 20, 2025
Homeసినిమాశ్రీలీలకి ఇప్పుడు హిట్టు పడాల్సిందే!

శ్రీలీలకి ఇప్పుడు హిట్టు పడాల్సిందే!

టాలీవుడ్ లోకి అడుగుపెడుతూనే కెరియర్ ను రాకెట్ స్పీడ్ తో పరిగెత్తించిన హీరోయిన్స్ కొంతమంది మాత్రమే కనిపిస్తారు. అలాంటి ఆ కొంతమంది జాబితాలో శ్రీలీల కూడా కనిపిస్తుంది.  మొదటి సినిమాతోనే గ్లామర్ తోను .. డాన్సులతోను తన మార్క్ చూపించిన శ్రీలీల, ఆ తరువాత ఎవరూ ఊహించని విధంగా కొత్త ప్రాజెక్టులను లైన్లో పెడుతూ వెళ్లింది. ఆమె స్పీడ్ చూసి మిగతా హీరోయిన్స్ ఆశ్చర్యపోయారు. ఈ లోగానే ‘ధమాకా’ .. ‘భగవంత్ కేసరి’ వంటి భారీ విజయాలు ఆమె ఖాతాలోకి చేరిపోయాయి.

క్రితం ఏడాది చాలా తక్కువ గ్యాపులో శ్రీలీల నుంచి నాలుగు సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో ‘భగవంత్ కేసరి’ మాత్రమే పెద్ద హిట్ పట్టుకొచ్చింది. రామ్ తో చేసిన ‘స్కంద’ .. నితిన్ తో చేసిన ‘ఎక్స్ ట్రా’ …  వైష్ణవ్ తేజ్ తో చేసిన ‘ఆదికేశవ’ సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి. ఫ్లాప్ రావడమనేది సహజం. కాకపోతే ఇక్కడ చాలా తక్కువ గ్యాపులో శ్రీలీల వరుస ఫ్లాపులను చవిచూడవలసి వచ్చింది. ఒక రకంగా ఇది ఆమె కెరియర్ కి ఇబ్బంది కలిగించే సన్నివేశమే.

ఈ నేపథ్యంలోనే మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన ‘గుంటూరు కారం’ ఈ సంక్రాంతి పండుగకి విడుదలవుతోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉందని అంటున్నారు. నిజానికి ఈ సినిమా ఈ సమయంలో రావడం శ్రీలీల చేసుకున్న అదృష్టంగానే చెప్పుకోవాలి. ఇంతకుముందు వచ్చిన వరుస ఫ్లాపుల నుంచి ఆమె బయటపడాలంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలి. ఆ మేజిక్ జరగడం ఖాయమేననే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి అభిమానులు ఆశించినట్టుగా జరుగుతుందేమో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్