Saturday, January 18, 2025
Homeసినిమా'పుష్ప-3' గురించి ఇంట్రస్టింగ్ న్యూస్

‘పుష్ప-3’ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న చిత్రం పుష్ప 2. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. పుష్ప సినిమాతో భారీగా పెరిగిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 మూవీని రూపొందిస్తున్నారు. బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. ఇందులో బాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి కానీ.. మేకర్స్ నుంచి ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. దీంతో పుష్ప 2 లో కొత్తగా ఎవరెవరు నటించనున్నారు అనేది ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే… పుష్ప కి సీక్వెల్ గా పుష్ప 2 రాబోతుంది. పుష్ప 2 కు సీక్వెల్ గా పుష్ప 3 కూడా ప్లానింగ్ లో ఉందని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. అది ఏంటంటే.. ఈ సినిమా సెకెండ్ హాఫ్ లో వచ్చే ఓ కొత్త క్యారెక్టర్ ద్వారా.. ఈ సినిమా క్లైమాక్స్ లో ఓ భారీ ట్విస్ట్ రివీల్ అవుతుందట. ఈ ట్విస్ట్  పుష్ప 3 కి లీడ్ అవుతుందని తెలుస్తోంది. ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ, ఈ వార్త మాత్రం బన్నీ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్