Sunday, January 19, 2025
Homeసినిమాజ‌క్క‌న్న‌కు మ‌హేష్ కండీష‌న్ పెట్టారా..?

జ‌క్క‌న్న‌కు మ‌హేష్ కండీష‌న్ పెట్టారా..?

Conditions Apply? సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట సినిమాతో స‌క్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే. జులై నుంచి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేయ‌నున్నారు. ఆత‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో మ‌హేష్ బాబు సినిమా సెట్స్ పైకి రానుంది. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై డా.కె.ఎల్. నారాయ‌ణ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ భారీ, క్రేజీ చిత్రం జ‌న‌వ‌రి నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది.

అయితే… ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాకుండానే కొన్ని వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. తాజాగా ఈ చిత్రం కోసం జక్కన్నకి మహేష్‌ ఓ కండీషన్‌ పెట్టాడట. అదేంటంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్‌ వద్దని, టాలీవుడ్ హీరోయిన్ లకే ప్రాధాన్యం ఇవ్వమని మహేష్‌ చెప్పాడట. గత సినిమాల్లో వరుసగా  బాలీవుడ్ హీరోయిన్ లతో పని చేసిన మహేష్‌ వాళ్ల తీరుతో విసిగిపోయాడట. అందుక‌నే మహేష్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

రాజమౌళి త‌న సినిమాల్లో న‌టించే న‌టీన‌టులు ఎవ‌రు అనేది ప్ర‌క‌టించే వరకు ఇలా వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌స్తూనే ఉంటాయి. మ‌రో విష‌యం ఏంటంటే.. రాజ‌మౌళి త‌న ఊహ‌ల్లో ఉన్న క్యారెక్ట‌ర్ కు ఎవ‌రు అయితే క‌రెక్ట్ గా సెట్ అవుతారు అనుకుంటారో వాళ్ల‌తోనే ఆ పాత్ర‌ను చేయిస్తారు త‌ప్పా.. వేరే వాళ్ల‌తో చేయించ‌రు. అస‌లు మ‌హేష్ కండీష‌న్ పెట్ట‌డం నిజ‌మేనా..? ఒక‌వేళ నిజ‌మే అయితే.. మ‌హేష్ చెప్పింది జ‌క్క‌న్నఫాలో అవుతాడా అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్