Saturday, March 14, 2026
Homeసినిమాప్ర‌భాస్ మ‌రో రెండు సినిమాల‌కు ఓకే చెప్పాడా..?

ప్ర‌భాస్ మ‌రో రెండు సినిమాల‌కు ఓకే చెప్పాడా..?

Prabhas New Movies  : పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ రిలీజ్ కి రెడీగా ఉంది. సంక్రాంతికి రావాల్సిన రాధేశ్యామ్ క‌రోనా థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డింది. మార్చిలో రాధేశ్యామ్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టుగా వార్తలు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే… రాధేశ్యామ్ తో పాటు ప్ర‌భాస్ స‌లార్, ఆదిపురుష్‌, ప్రాజెక్టె కె, స్పిరిట్ చిత్రాలు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఇవి కాకుండా మ‌రో రెండు సినిమాల‌కు ఓకే చెప్పాడ‌ట ప్ర‌భాస్.

ఇంత‌కీ ఆ రెండు ప్రాజెక్టులు ఏంటంటే… ఎప్ప‌టి నుంచో పెండింగ్ లో ఉన్న మైత్రీ మూవీ మేక‌ర్స్  బ్యాన‌ర్ లో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడ‌ట‌. ఈ భారీ పాన్ ఇండియా మూవీకి బాలీవుడ్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ని… ఇది భారీ మ‌ల్టీస్టార‌ర్ అని వార్త‌లు వ‌స్తున్నాయి. చాలా కాలంగా ప్ర‌చారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫైన‌ల్ అయ్యింద‌ని తెలిసింది.

ఇక మ‌రో ప్రాజెక్ట్ ఏంటంటే… ప్ర‌భాస్ ఎప్ప‌టి నుంచో దిల్ రాజు బ్యాన‌ర్ లో సినిమా చేస్తాన‌ని మాట ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ కూడా క‌న్ ఫ‌ర్మ్ అయ్యింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ లెక్కన ప్ర‌భాస్ 2025 వ‌ర‌కు ఫుల్ బిజీ.  మొత్తానికి ప్ర‌భాస్ ప్లానింగ్ మామూలుగా లేదుగా….

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular