What Happened: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందనుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గురించి గరించి వార్తలు రావడంతో చరణ్ ని గౌతమ్ ఎలా చూపించనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఈ సినిమా షూటింగ్కు సంబంధించి.. గత కొన్ని రోజులుగా ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది కానీ.. మేకర్స్ మాత్రం స్పందించకుండా సైలెంట్ గా ఉన్నారు. ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు.
ఇంతకీ విషయం ఏంటంటే… గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ సినిమా హిందీలో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. అయితే.. జెర్సీ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. పైగా స్లో నేరేషన్, మితిమీరిన క్రికెట్ ఉంది అంటూ విమర్శలు వచ్చాయి. అది వసూళ్లు పై బాగా ప్రభావం చూపించి… ఆడియన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో గౌతమ్ రీజనల్ సినిమాలు చేయడమే బెటర్ అనే కామెంట్స్ వినిపించాయి.
ఇప్పుడు హిందీ జెర్సీ ఫలితం ప్రభావం గౌతమ్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రానున్న సినిమా పై బాగా పడిందని… అందుచేత ఈ సినిమా క్యాన్సిల్ అవుతుందని… చరణ్ ఈ సినిమా చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. అయితే.. ప్రచారంలో ఉన్నది వాస్తవమేనా కాదా అనేది తెలియాల్సివుంది.
Also Read : చరణ్ తో సినిమా నా డ్రీమ్ : గౌతమ్ తిన్ననూరి