Tuesday, September 24, 2024
Homeసినిమాఐకాన్ స్టార్ ఫంక్షన్ కు యంగ్ రెబెల్ స్టార్?

ఐకాన్ స్టార్ ఫంక్షన్ కు యంగ్ రెబెల్ స్టార్?

Prabhas for Pushpa:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‌’. ఈ పాన్ ఇండియా మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీ ట్రైల‌ర్ డిసెంబర్ 6న  విడుదల కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ విడుదలైంది. అందులో అల్లు అర్జున్ లుక్ అదిరింది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

ఇక డిసెంబర్ 12న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టుగా టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్‌లో భారీ స్థాయిలో జరపబోతున్న ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ‘పుష్ప’ మేకర్స్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారని ప్రచారం జరుగుతుంది. మొదట్లో ఈ ఈవెంట్ కు ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హాజ‌రుకానున్నార‌ని వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ప్ర‌భాస్ పేరు వినిపిస్తోంది. దీంతో ‘పుష్ప’ ఈవెంట్ కి ఎవ‌రు గెస్ట్ గా రానున్నార‌నేది ఆస‌క్తిగా మారింది.

Also Read : డిసెంబర్ 6న ‘పుష్ప’ ట్రైలర్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్