Sunday, January 19, 2025
Homeసినిమా‘వీర‌మ‌ల్లు’లో అకిరా నంద‌న్?

‘వీర‌మ‌ల్లు’లో అకిరా నంద‌న్?

Akira Entry: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రేణు దేశాయ్ దంప‌తుల కుమారుడు అకిరా నంద‌న్. గ‌త కొంత‌కాలంగా అకిరా నంద‌న్ ఎంట్రీ గురించి వార్త‌లు వ‌స్తున్నాయి. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై అకిరా నంద‌న్ ఎంట్రీ ఉంటుంద‌ని.. చరణ్  ఆ బాధ్య‌త‌ల‌ను తీసుకుంటాడ‌ని టాలీవుడ్ లో గ‌ట్టిగా టాక్ వినిపించింది. ఏప్రిల్ 8న అకిరా నంద‌న్ పుట్టిన‌రోజు. అయితే.. ఆరోజున అకిరా నంద‌న్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్ అయ్యింది.

అయితే.. రేణు దేశాయ్.. అకిరా సినిమాల్లో రావ‌డానికి టైమ్ ఉంద‌ని.. అకిరాకి ఆస‌క్తి ఉంటే వ‌స్తాడు లేక‌పోతే లేదు అన్న‌ట్టుగా స్పందించారు. ఇదిలా ఉంటే.. అకిరా నంద‌న్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సినిమాలో న‌టిస్తున్నాడ‌ని.. ఇదే అత‌ని డెబ్యూ మూవీ క‌న్ ఫ‌ర్మ్ అంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ప‌వ‌ర్ స్టార్ అభిమానులు ఇది నిజ‌మా..?  కాదా..? అని ఆరా తీస్తున్నారు. ఇదే క‌నుక నిజ‌మైతే.. వీర‌మ‌ల్లుకి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల పై క్రిష్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read : వీర‌మ‌ల్లు షూటింగ్ కి రెడీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్