Sunday, January 19, 2025
Homeసినిమామ‌హేష్ మూవీలో అనిల్ క‌పూర్.?

మ‌హేష్ మూవీలో అనిల్ క‌పూర్.?

AK in GMB movie: సూపర్ స్టార్ మహేష్ బాబు న‌టిస్తోన్న తాజా చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌‘. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. మే 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు న‌టించ‌నున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్‌ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ మూవీలో కీలక పాత్ర ఉందని, ఆ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఈ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ నటిస్తున్నార‌ట. అనిల్ కపూర్ ది మహేష్ కి ఫాదర్ క్యారెక్టర్ అని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ మూవీ పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. అయితే.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజమేనా..?  కాదా..? అనేది తెలియాల్సివుంది. 11 సంవత్సరాల తరువాత మహేష్,  త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండ‌డంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మ‌రి.. ఈ మూవీతో మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ ఏ స్థాయి విజ‌యాన్ని సాధిస్తారో చూడాలి.

Also Read : స‌ర్కారు వారి పాట వాయిదా ప‌డ‌నుందా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్