Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్ మూవీ కోసం నీల్ ఐడియా అదిరింది.

ఎన్టీఆర్ మూవీ కోసం నీల్ ఐడియా అదిరింది.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రాబోతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఈ భారీ, క్రేజీ మూవీని అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. అంతే కాకుండా.. ఫ‌స్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్ లో ఎన్టీఆర్ ప‌వ‌ర్ ఫుల్ గా క‌నిపించ‌డం.. ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని స‌రికొత్త పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నార‌ని టాక్ రావ‌డంతో ఈ సినిమా పై ఇప్ప‌టి నుంచే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

అయితే.. ఈ సినిమాలో యూనివ‌ర్శ‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ న‌టించ‌నున్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు దీనికి సంబంధించి మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే… ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఢీకొట్టే విలన్‌ పాత్రలో యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌ను బరిలోకి దించనున్నాడట ప్ర‌శాంత్ నీల్. ఇటీవల విడుదలై విక్రమ్‌ ట్రైలర్‌లో కమల్ లుక్స్‌ మాస్‌గా, రఫ్‌గా కనిపించడంతో ఆయన అయితేనే ఈ మూవీలో విలన్‌ రోల్‌కు సరిగ్గా సరిపోతాడని ప్రశాంత్ భావించినట్లు సమాచారం.

అయితే.. ఈ సినిమా కథను కమల్‌ హాసన్‌కు వినిపించగా, ఆయన కూడా కథ బాగా నచ్చి ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్స్‌ మాస్‌ ఐడియా నీల్‌ మావా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ ప్ర‌చారంలో ఉన్న‌ది నిజమైతే.. ఇటు ఎన్టీఆర్ యాక్టింగ్, అటు కమల్‌ హాసన్‌ యాక్టింగ్ ఒకే తెర పై చూస్తే… అభిమానుల‌కు పండ‌గే.

Also Read : అంచ‌నాలు పెంచేసిన‌ ఎన్టీఆర్-31 పోస్ట‌ర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్