Sunday, January 19, 2025
Homeసినిమాశంక‌ర్ కి షాక్ ఇచ్చిన మోహ‌న్ లాల్?

శంక‌ర్ కి షాక్ ఇచ్చిన మోహ‌న్ లాల్?

Mohan Lal Mega Shock: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే.  దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది చ‌ర‌ణ్ 15వ‌, దిల్ రాజు 50వ చిత్రం కావ‌డం విశేషం. ఆమ‌ధ్య రాజ‌మండ్రి, హైద‌రాబాద్లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ 30 శాతం షూటింగ్‌ను జరుపుకుంది. ఇందులో చరణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సంబంధించి రోజుకో అప్‌డేట్‌ బయటకు వస్తోంది. తాజాగా ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం మలయాళ అగ్ర హీరో మోహన్‌ లాల్ ను శంక‌ర్ కాంటాక్ట్ చేస్తే.. నో చెప్పార‌ట‌. మోహ‌న్ లాల్ అలా చెప్ప‌డంతో శంక‌ర్ షాక్ అయ్యార‌ని టాక్ వినిపిస్తోంది. కార‌ణం ఏంటంటే… ఆ పాత్ర‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్నాయ‌ట‌. నేను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లు పోషించాలి అనుకోవ‌డం లేదు. అందుచేత ఈ సినిమాలో న‌టించ‌లేను అని సున్నితంగా తిరస్క‌రించార‌ట మోహ‌న్ లాల్. అదీ.. మేట‌రు.

Also Read : చ‌ర‌ణ్‌, శంక‌ర్ మూవీ ఫ‌స్ట్ లుక్ డేట్ ఫిక్స్? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్