Saturday, January 18, 2025
Homeసినిమామ‌ళ్లీ వార్తల్లోకి భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్

మ‌ళ్లీ వార్తల్లోకి భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన చిత్రాల్లో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ తో గ‌బ్బ‌ర్ సింగ్ మూవీని డైరెక్ట్ చేసిన హ‌రీష్ శంక‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఈ చిత్రాన్ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన‌ప్ప‌టి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ప‌వ‌న్ పొలిటిక‌ల్ గా బిజీ అవ్వ‌డంతో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ ఆల‌స్యం అవుతూనే ఉంది. ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇదిలా ఉంటే.. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని మైత్రి నిర్మాతలు నవీన్, రవిశంకర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలిశారట‌. అనంతరం స్టోరీ ఫైనల్ నారేషన్ ఇచ్చిన హరీష్ శంకర్, పవన్ నుండి కాల్ షీట్స్ విషయమై గ్రీన్ సిగ్నల్ అందుకున్నారట. త్వరలో షూట్ కి రెడీ కాబోతున్న ఈ మూవీకి సంబందించిన పూర్తి డీటెయిల్స్ అన్ని అఫీషియల్ గా అనౌన్స్ కానున్నాయని స‌మాచారం.

గబ్బర్ సింగ్ తరువాత రానున్న మూవీ కావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భవదీయుడు మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్ టైన‌ర్ గా అందరినీ ఆకట్టుకునేలా అద్భుతంగా స్టోరీ, స్క్రిప్ట్ డిజైన్ చేశారట దర్శకుడు హరీష్. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ అందించనున్నారు. అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగి భ‌వ‌దీయుడు సెట్స్ పైకి వ‌చ్చి.. నెక్ట్స్ ఇయ‌ర్ థియేట‌ర్లోకి వ‌స్తే.. ఫ్యాన్స్ కి పండ‌గే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్