Wednesday, March 11, 2026
Homeసినిమాపవన్ కోసం విజయేంద్రప్రసాద్ ‘పవర్’ ఫుల్ స్టోరీ

పవన్ కోసం విజయేంద్రప్రసాద్ ‘పవర్’ ఫుల్ స్టోరీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రీ ఎంట్రీ ఇస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఆయన దృష్టిలో పెట్టుకుని పలువురు దర్శకులు, రచయితలు కథలు రాయడం స్టార్ట్ చేశారు. ‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్, ‘హరి హర వీరమల్లు’ చిత్రాల్లో నటిస్తున్నారు. పవన్ కోసం హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి కూడా వెయిటింగ్ లో ఉన్నారు. ఇప్పుడు పవర్ స్టార్ కోసం పాన్ ఇండియా రైటర్ విజయేంద్రప్రసాద్ ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశారట. పవన్ కి విజయేంద్రప్రసాద్ కథ చెప్పడం.. కథ విన్న వెంటనే పవన్ ఓకే చెప్పడం జరిగిందని తెలిసింది.

పవన్ అంటే విజయేంద్రప్రసాద్ కు విపరీతమైన అభిమానం. ‘బాహుబలి’ చిత్రంలో ఇంటర్వెల్ లో వచ్చే సన్నివేశం కూడా పవన్ క్రేజ్ ని ఇన్ స్పిరేషన్ గా తీసుకొని రాసినట్లు ఓ సందర్భంలో తెలియచేశారు. ఇటీవల ఆలీతో సరదాగా పొగ్రామ్ లో పాల్గొన్న విజయేంద్రప్రసాద్.. పవన్ కళ్యాణ్ కోసం కథ రాయాలంటే.. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయన గత సినిమాల్లోని కొన్ని సీన్స్ తీసుకుని కథ ఈజీగా రాసేయచ్చు అని చెప్పారు. అలా చెప్పిన విజయేంద్రప్రసాద్ పవర్ స్టార్ కోసం ఎలాంటి పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశారనేది ఆసక్తిగా మారింది. రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు విజయేంద్రప్రసాదే కథ అందిస్తుంటారు. మరి.. పవన్ కోసం విజయేంద్రప్రసాద్ రాసిన ఈ కథను ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular