Friday, March 13, 2026
Homeసినిమాప్ర‌భాస్, మారుతి మూవీ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

ప్ర‌భాస్, మారుతి మూవీ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య నిర్మించాలనుకున్నారు కానీ.. లాస్ట్ మినిట్ లో ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నారు. దీంతో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించనుంది.  పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ సినిమాని నిన్న హైద‌రాబాద్ లో ప్రారంభించారు కానీ.. ఫోటోలు, వీడియో బయటకు రాకుండా అతి కొద్దిమంది స‌మ‌క్షంలోనే ఆ కార్యక్రమాన్ని నిర్వ‌హించారు.

ఇక ఈ క్రేజీ కాంబో మూవీ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ లో కొంత నెగటివిటీ ఉంది. కాగా దానిని అధిగమించేలా సూపర్ బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారట మారుతి. ఇక ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న బజ్ ప్రకారం, దీనిని పక్కాగా యాక్షన్ తో కూడిన కమర్షియల్ మూవీగా ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ అలరించే విధంగా దర్శకుడు మారుతీ తెరకెక్కించనున్నారట.

కొత్త హర్రర్ తో కూడిన ఎంటర్టైన్మెంట్, కామెడీ, యాక్షన్, కమర్షియల్ హంగులతో మారుతి తీయనున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఇంట్రస్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. మిర్చి తరువాత ప్రభాస్ నుండి వచ్చిన మూవీస్ లో ఆయన నుండి ఫ్యాన్స్ ఆశించే స్థాయి స్పెషల్ ఇంట్రడక్షన్ సాంగ్ రాలేదు. అయితే.. ఈ సినిమాలో డార్లింగ్ కి అదిరిపోయే రేంజ్ లో ఒక పవర్ ఫుల్ ఇంట్రడక్షన్ సాంగ్ ని ప్లాన్ చేశార‌ట‌ మారుతి. మొత్తానికి మారుతి చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. మ‌రి.. ఎంత వ‌ర‌కు మెప్పిస్తాడో చూడాలి.

Also Read మారుతికి ప్రభాస్ అభయం 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular