Friday, March 13, 2026
Homeసినిమా'ఉస్తాద్ భగత్ సింగ్' నిజంగానే ఆగిపోయిందా?

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నిజంగానే ఆగిపోయిందా?

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వడివడిగా  ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.  త్వరలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుందని ఇటీవల ప్రకటించారు.

అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో ఇప్పట్లో ఈ సినిమా సెట్స పైకి వచ్చే ఛాన్స్ లేదు. దీంతో హరీష్ శంకర్.. రవితేజతో సినిమా చేయాలనుకుంటున్నారట, దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్టు సమాచారం. ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే హరీష్ శంకర్ టీజర్ రిలీజ్ చేసి చాలా హడావిడి చేశాడు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుందని ప్రకటించాడు.

పాపం.. హరీష్ శంకర్ ఎప్పటి నుంచో ఉస్తాద్ భగత్ సింగ్ పై ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇలా జరిగిందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై హరీష్ శంకర్ క్లారటీ ఇస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular