Saturday, January 18, 2025
Homeసినిమా‘వీరయ్య’ గా చిరు?

‘వీరయ్య’ గా చిరు?

మెగాస్టార్ చిరంజీవి – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య. దీని తర్వాత మలయాళంలో విజయం సాధించిన ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ లో చిరంజీవి నటించనున్నారు. మోహన్ రాజా దీనికి దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ దీన్ని నిర్మించనున్నారు.

ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు. ఆచార్య పూర్తైన వెంటనే లూసిఫర్ రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టారు దర్శకుడు మోహన్ రాజా. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాకి ‘వీరయ్య’ అనే టైటిల్ ఖరారు చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో చిరు రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. సత్యదేవ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సోనాక్షి సిన్హా కథానాయికగా ఓకే చెప్పినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. చిరంజీవి.. బాబీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ వీరయ్య అంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు లూసిఫర్ రీమేక్ టైటిల్ వీరయ్య అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే.. లూసిఫర్ రీమేక్ డైరెక్టర్ మోహన్ రాజా కానీ.. డైరెక్టర్ బాబీ కానీ వీరయ్య టైటిల్ గురించి స్పందించలేదు. మరి.. ఈ టైటిల్ ను చిరు నటించే ఏ సినిమాకి ఖరారు చేస్తారనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్