Sunday, January 19, 2025
Homeసినిమాప్రభాస్, లోకేష్‌ మూవీ ఫిక్స్ అయ్యిందా..?

ప్రభాస్, లోకేష్‌ మూవీ ఫిక్స్ అయ్యిందా..?

ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం సలార్. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. బాహుబలి హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో సలార్  పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. సలార్ తో పాటు ప్రభాస్ కల్కి, మారుతితో మూవీ, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా చేయాల్సివుంది. హను రాఘవపూడితో మూవీ కన్ ఫర్మ్ అయ్యిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మరో సినిమాకి ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది.

అదే.. కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో అని అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ భారీ, క్రేజీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్  నిర్మించనుందని తెలిసింది. ఇటీవల లోకేష్ కనకరాజ్ ని కాంటాక్ట్ చేసి ప్రభాస్ కోసం కథ రెడీ చేయమని చెప్పారట. దీనికి లోకేష్ ఓకే చెప్పారని సమాచారం. ప్రస్తుతం లోకేష్‌ కనకరాజ్ విజయ్ తో లియో మూవీ చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. రజినీకాంత్, రామ్ చరణ్‌ లతో కూడా లోకేష్ కనకరాజ్ సినిమాలు చేయాలి అనుకుంటున్నాడని టాక్.

ఆమధ్య లోకేష్‌ కనకరాజ్.. ప్రభాస్ తో మూవీ చేయడానికి పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాను. ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా.. ఉంటుందని ఓ ఇంటర్ వ్యూలో చెప్పాడని వార్తలు వచ్చాయి. దీంతో ఈ క్రేజీ కాంబో ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటీ పెరిగింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్