Wednesday, March 11, 2026
Homeసినిమాఅక్టోబర్ 1న ‘ఆచార్య’?

అక్టోబర్ 1న ‘ఆచార్య’?

మెగాస్టార్ చిరంజీవి – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ మెగా మల్టీస్టారర్ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తి అయ్యింది. ఆ పాటను చరణ్ పై చిత్రీకరించాలి. చరణ్‌ ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ఆ పాటను చిత్రీకరించనున్నారు.

ఇదిలా ఉంటే.. సంక్రాంతికి పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ, మహేష్ బాబు సర్కారు వారి పాట, ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ విడుదల కానున్నాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప క్రిస్మస్ కి రానుందని అఫిషియల్ గా ప్రకటించారు.

ఇలా.. భారీ చిత్రాల విడుదలకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్స్ వస్తున్నాయి కానీ.. ఆచార్య సినిమా విడుదలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీంతో ఆచార్య వచ్చేది ఎప్పుడు అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఆచార్య చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆర్ఆర్ఆర్ అనుకున్నట్టుగా అక్టోబర్ 13న విడుదల కాకపోతే.. ఆ డేట్ కి ఆచార్య చిత్రాన్ని విడుదల చేయాలని  అనుకుంటున్నారని తెలిసింది. అందుచేత ఆచార్య అక్టోబర్ 1న వస్తుందా..? లేక అక్టోబర్ 13న వస్తుందా..? క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular