Saturday, January 18, 2025
Homeసినిమాఅనుష్క సినిమా ఆగిపోయిందా.?

అనుష్క సినిమా ఆగిపోయిందా.?

అందం, అభిన‌యం ఈ రెండు ఉన్న అతి కొద్ది మంది క‌ధానాయిక‌ల్లో అనుష్క ఒక‌రు. టాలీవుడ్ కింగ్ నాగార్జున – డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో రూపొందిన స్టైలీష్ ఫిల్మ్ ‘సూప‌ర్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ బెంగుళూరు భామ‌. తొలి సినిమాతోనే విజ‌యం సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆత‌ర్వాత ‘స్టాలిన్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ఓ సాంగ్ లో స్టెప్పులు వేసి కుర్ర‌కారు మ‌న‌సులు దోచుకుంది. ఇక ఈ అమ్మ‌డు కెరీర్ లో మ‌ర‌చిపోలేని సినిమా అరుంథ‌తి. ఈ సినిమా అనుష్క ద‌శ‌నే మార్చేసింది.  లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయాలంటే అనుష్క‌నే చేయాలి అనేంత గుర్తింపు సాధించింది.

బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి… ఇలా విభిన్న క‌థా చిత్రాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌క హృద‌యాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకుంది. కొంతకాలంగా క‌థానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ .. విజయాలను అందుకుంటూ వస్తోన్న అనుష్క‌ ఇటీవల నిశ్శబ్దం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన సినిమాలో నటించింది. హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే.. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత నుంచి ఇప్పటి వరకు అనుష్క తదుపరి చిత్రం ఎవరితో అనేది ప్రకటించలేదు.

యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి, అనుష్క ప్రధాన పాత్రధారులుగా రారా కృష్ణయ్యా ఫేం పి.మహేష్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని టాక్ వచ్చింది. త్వరలో సెట్స్ పైకి వెళుతుందని అనుకుంటే.. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్