Saturday, November 23, 2024
Homeసినిమాసంక్రాంతికి చిన్న సినిమాల జాతర!  

సంక్రాంతికి చిన్న సినిమాల జాతర!  

Sankranthi -Fray: సంక్రాంతి పండుగ అంటే పంటలు ఇళ్లకు వచ్చే సమయం .. థియేటర్లకు కొత్త సినిమాలు వచ్చే సమయం. సంక్రాంతి పండుగకి సెలవులు ఎక్కువ రోజులు ఉండడటం .. డబ్బులు చేతిలో ఆడటం వలన సినిమాలు చూడటం ఎక్కువగానే ఉంటుంది. అందువల్లనే సంక్రాంతికి తమ సినిమాలను బరిలో ఉంచడానికి స్టార్ హీరోలు పోటీ పడుతుంటారు. సంక్రాంతి విజేతగా నిలవాలని ఆరాటపడుతుంటారు. పెద్ద సినిమాలు బరిలో ఉంటాయి గనుక, చిన్న సినిమాలెప్పుడూ సంక్రాంతికి కనుచూపు మేరలో కూడా కనిపించవు. అలాంటిది ఈ సంక్రాంతికి చిన్న సినిమాలు మాత్రమే బరిలో మిగలడం విచిత్రం .. విశేషం.

ఈ సంక్రాంతికి పాన్ ఇండియా సినిమాలుగా ‘ఆర్ ఆర్ ఆర్’ .. ‘రాధేశ్యామ్’ ముందుగా బరిలోకి దిగాయి. దాంతో ‘భీమ్లా నాయక్’ .. ‘సర్కారువారి పాట’ వంటి సినిమాలు కూడా థియేటర్ల సమస్య తలెత్తుతుందనే ఉద్దేశంతో విడుదల తేదీలను మార్చుకున్నాయి. ‘ఆచార్య’ కూడా ముందుగానే ప్లాన్ మార్చుకుని ఫిబ్రవరికి వెళ్లిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఆర్ ఆర్ ఆర్’ .. ‘రాధేశ్యామ్’ ఈ రెండు సినిమాలు కూడా ఇతర రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కారణంగా విడుదల తేదీని వాయిదా వేసేశాయి. దాంతో చిన్న సినిమాలు .. డబ్బింగ్ మూవీలు కట్టలు తెంచుకున్నట్టుగా బరిలోకి ఉరికొస్తున్నాయి.

జనవరి 7వ తేదీన థియేటర్లకు రావడానికి రానా ‘1945’ .. ఆది సాయికుమార్ ‘అతిథి దేవోభవ’  సినిమాలు ముస్తాబవుతున్నాయి. ఇక 13వ తేదీన అజిత్ ‘వలిమై’ .. 14వ తేదీన విశాల్ ‘సామాన్యుడు’ తెరపైకి రావడానికి రెడీ అవుతున్నాయి. కొంతకాలంగా సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్న కల్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’తో పాటు, ‘రౌడీ బాయ్స్’ .. ‘డీజే టిల్లు’ .. ‘7 డేస్ 6 నైట్స్’ థియేటర్లలో దిగుతున్నాయి. ఇక 15వ తేదీన అశోక్ గల్లా ‘హీరో’ విడుదల కానుంది. ఈ సందడిలోనే బరిలోకి దిగడానికి ‘బంగార్రాజు’ సిద్ధమవుతున్నాడు. ఒక వైపున కరోనా విరుచుకుపడనుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో, చిన్న సినిమాలు సందడికి సమాయత్తం కావడం విశేషమే.

Also Read : రాధే శ్యామ్ సైతం వాయిదా!

RELATED ARTICLES

Most Popular

న్యూస్