Saturday, January 18, 2025
Homeసినిమాఎన్టీఆర్, కొర‌టాల మూవీ మ‌రింత ఆల‌స్యం కానుందా.?

ఎన్టీఆర్, కొర‌టాల మూవీ మ‌రింత ఆల‌స్యం కానుందా.?

Movie: ఆర్ఆర్ఆర్ మూవీలో కొమ‌రం భీమ్ గా ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం చూపించిన విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్, కొర‌టాల శివ‌తో సినిమాను అనౌన్స్ చేశారు. దీంతో ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ చేసే సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది..? అని అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత చిన్న గ్యాప్ తీసుకుని సినిమా స్టార్ట్ చేయాలి అనుకున్నారు. కొర‌టాల శివ కూడా ఆచార్య త‌ర్వాత స్మాల్ గ్యాప్ తీసుకుని మూవీ స్టార్ట్ చేయాలి అనుకున్నారు.

అయితే.. ఎన్టీఆర్, కొర‌టాల ప్లాన్స్ రివ‌ర్స్ అయ్యాయి. ఆచార్య సినిమా ఫలితంతో వాయిదా వేయాల్సి వచ్చింది. స్క్రిప్ట్ వర్క్ కోసం కొరటాల కొంత సమయం తీసుకుని ఎన్టీఆర్ తో ఆగస్టులో సినిమాను మొదలు పెట్టాలని భావించాడు. కానీ ఆగస్టులో కూడా సినిమా పట్టాలెక్కే పరిస్థితి లేదు. ఒక వైపు కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ ను ఇంకా ముగించలేదు. పైగా ఎన్టీఆర్ కూడా ప్రముఖ ట్రైనర్ సమక్షంలో ఫిట్ నెస్ వర్కౌట్స్ చేస్తున్నాడు.

స్క్రిప్ట్ కు అనుగుణంగానే ఫిట్ నెస్ ను సాధించే ఉద్దేశ్యంతో ఈ రెండు మూడు నెలల పాటు ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఎక్కువ సమయం వర్కౌట్స్ చేయడంతో పాటు స్క్రిప్ట్ కు సంబంధించిన చర్చలు జరుపుతున్నాడు. న‌వంబ‌ర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంద‌ని టాక్ వినిపిస్తోంది. అయితే.. న‌వంబ‌ర్ లో సినిమాను స్టార్ట్ చేసినా స‌మ్మ‌ర్ కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి.. త్వ‌ర‌లోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read : ఎన్టీఆర్ కి క‌థ చెప్పిన హ‌ను. ఆ త‌ర్వాత ఏమైంది..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్