Saturday, January 18, 2025
HomeTrending Newsకాళేశ్వరంపై నిరాధార ఆరోపణలు - హరీష్ ఆగ్రహం

కాళేశ్వరంపై నిరాధార ఆరోపణలు – హరీష్ ఆగ్రహం

టీఆర్ఎస్ ప్రభుత్వానికి కుల, మతాల భేదం లేదని, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పరిపాలనలో లబ్ధిదారులకు75 రూపాయల పెన్షన్ మాత్రమే వచ్చేదని, అది కూడా ఒక గ్రామంలోని కొంతమందికే వచ్చేదని చెప్పారు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం 2016 రూపాయల పెన్షన్ అందజేస్తూ లబ్ధిదారులకు ఆసరాగా ఉంటోందన్నారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పని చేస్తోందని తెలిపారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు.

ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కూడా బలోపేతం చేసి, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఆడపిల్లల వివాహాలకు ఏ ప్రభుత్వం అందించని సహాయం ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ ద్వారా లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో కూర్చున్న వారు కాళేశ్వరం మీద నిరాధార విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదవ రెడ్డి, ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read :  బీజేపీ డైరెక్షన్ లో సీబీఐ పనిచేస్తుందా హరీష్ రావు

RELATED ARTICLES

Most Popular

న్యూస్