Sunday, September 8, 2024
HomeసినిమాAshika Ranganath: నాగార్జున 'నా సామి రంగ' అప్ డేట్ ఏంటి..?

Ashika Ranganath: నాగార్జున ‘నా సామి రంగ’ అప్ డేట్ ఏంటి..?

అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నా సామి రంగ‘. ఈ సినిమా ద్వారా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ది ఘోస్ట్ రిలీజ్ తర్వాత నుంచి చాలా కథలు విని ఫైనల్ గా నా సామి రంగ చిత్రాన్ని చేయడానికి ఓకే చెప్పారు. ఇటీవల నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ అండ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వస్తుంది..? అప్ డేట్ ఏంటి అని నాగ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇంతకీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ మూవీలో నాగార్జునకి జోడీగా ఆషికా రంగనాథ్, అలానే మానస వర్షిణి ల పేర్లని టీమ్ పరిశీలించిందని తెలిసింది. ఇద్దరికీ లుక్ టెస్ట్ చేశారట. ఈ ఇద్దరిలో ఒకరు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాల దర్శకుడు కరుణ కుమార్ ఇందులో నెగిటివ్ క్యారెక్టర్ చేస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఇందులో ప్రేక్షకులు కోరుకునే ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్ సమపాళ్లలో ఉన్నాయట.

చాలా గ్యాప్ తర్వాత నాగార్జున చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్ కు అదిరిపోయే మ్యూజిక్ అందించారు. నాగార్జున – కీరవాణి కాంబినేషన్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఖచ్చితంగా ఈసారి కూడా ఈ కాంబో మ్యాజిక్ చేస్తుందనే టాక్ వినిపిస్తుంది. నాగార్జునకు సంక్రాంతి బాగా కలిసొచ్చింది. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు చిత్రాలు సంక్రాంతికి వచ్చాయి. సక్సెస్ అయ్యాయి. అందుకనే ఆ సెంటిమెంట్ ప్రకారమే నా సామి రంగ చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఈ మూవీతో కూడా నాగ్ బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.

Also Read: Naa Saami Ranga: నాగార్జున నా సామిరంగ ఫస్ట్ లుక్, గ్లింప్స్

RELATED ARTICLES

Most Popular

న్యూస్