టాలీవుడ్ కి ఈ ఏడాదిలో హీరోయిన్స్ గా చాలామంది బ్యూటీలు పరిచయమయ్యారు. అయితే వారిలో చాలామందికి హిట్ పడలేదు. అందువలన మరో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయారు. ఐయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం తవరలోనే తప్పకుండా మరో ఛాన్స్ వస్తుందని అఆడియన్స్ భావించారు. అలాంటివారి జాబితాలో ఆషికా రంగనాథ్ ఉండటం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘అమిగోస్’ సినిమాలో ఆమె హీరోయిన్ గా మెరిసింది. కల్యాణ్ జోడీగా సందడి చేసింది.
ఆ సినిమాలో ఆమె చాలా రొమాంటిక్ గా మెరిసింది. దాంతో యూత్ నుంచి ఈ సుందరికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడంతో, అనుకున్నంత తేలికగా ఆమెకి మరో అవకాశం రాలేదు. అయితే ఆకర్షణీయమైన ఆమె రూపం చూసి, తప్పకుండా ఆమె మళ్లీ తెరపైకివస్తుందని కొంతమంది భావించారు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ, ఆమె ఏకంగా నాగార్జున సినిమా ‘నా సామిరంగలో ఛాన్స్ కొట్టేసింది.
నాగ్ హీరోగా ‘నా సామిరంగా’ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. పక్కా ప్లానింగ్ తో చాలా స్పీడ్ గా షూటింగు జరుపుకుంటోంది. గ్రామాన్ని నేపథ్యంలో నడిచే కథ ఇది. ఆషిక ఈ సినిమాలో ‘మహాలక్ష్మి’ అనే పాత్రను పోషించినట్టుగా రీసెంటుగా నాగార్జున చెప్పారు. త్వరలో ఆమెకి సంబంధించిన పోస్టర్ ను వదలనున్నారు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా హిట్ అయితే ఆషిక ఇక్కడ బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చూడాలి మరి ఈ సుందరి అదృష్టం ఎలా ఉంటుందో.