Sunday, January 19, 2025
Homeసినిమాదిల్‌ రాజు ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇస్తున్న హీరో ఆశిష్

దిల్‌ రాజు ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇస్తున్న హీరో ఆశిష్

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేష‌న్‌తో … శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌ (శిరీష్ త‌న‌యుడు). ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ విడుద‌ల చేయ‌గా, మోష‌న్ పోస్ట‌ర్‌ను మాస్ట‌ర్ ఆఫ్ సిల్వ‌ర్ స్క్రీన్‌గా పిలుచుకునే డైరెక్ట‌ర్ సుకుమార్ విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ… “ఈరోజు చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌గా ఉంది. సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మాకు ఇది సిల్వ‌ర్ జూబ్లీ ఇయ‌ర్‌. ఈ జ‌ర్నీలో ఎన్నో అనుభూతులున్నాయి. ఇప్పుడు 50వ సినిమా చేస్తున్నాం. నేను వినాయ‌క్ కంటే ముందు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాను. డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో ‘ఆది’ సినిమాను పంపిణీ చేస్తున్నాను. ఆ స‌మ‌యంలో వినాయ‌క్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాడు. నిర్మాత కావాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో వినాయ‌క్ త‌న తొలి సినిమాను మా బ్యాన‌ర్‌లో చేసి రాజును కాస్త ‘దిల్‌’ రాజుగా మార్చేశాడు. ఆ క్రెడిట్ వినాయ‌క్‌కి మాత్ర‌మే ద‌క్కుతుంది.

మా ఇంట్లో నుంచి ఆశిష్ హీరో అవుతాడ‌ని అనుకోలేదు. అయితే త‌న‌లో ఓ ఫైర్ ఉండేది. అది చూసిన‌ప్పుడు హీరో అవుతావా అని అడిగేవాళ్లం. త‌న‌లో ఆ కోరిక ఉండిందో, లేక మేం ఎప్పుడూ సినిమాల గురించి మాట్లాడుకునే వాతావ‌ర‌ణం వ‌ల్ల ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యిందో తెలియ‌దు. అయితే, మా ఫ్యామిలీ ఫంక్ష‌న్స్‌లో త‌ను డ్యాన్స్‌, ఎన‌ర్జీ చూసి త‌న‌కు ఇంట్రెస్ట్ ఉంద‌నిపించింది. గ‌త మూడేళ్లుగా త‌ను శిక్ష‌ణ తీసుకున్నాడు. యు.ఎస్‌, బాంబే, వైజాగ్‌లో ట్రైన‌ప్ అయ్యాడు. సినిమా ఇండ‌స్ట్రీలోకి హీరోగా రావాల‌ని చాలా మందికి కోరిక ఉంటుంది. వ‌స్తారు కూడా. అయితే ఎంత మంది స‌క్సెస్ అవుతార‌నేది నేను ఈ ఇర‌వై ఏళ్ల జ‌ర్నీలో నేను ద‌గ్గ‌ర్నుంచి చూశాను. అదంత సుల‌భం కాదు. మా బ్యాన‌ర్ ఉంది. క‌థ‌ల‌ను మేం విని ఓకే చేస్తాం. అయితే వీటన్నింటికీ మించి ప్రేక్ష‌కులున్నారు. ప్రేక్ష‌కులు ఓ సినిమాను చూసి ఇంప్రెస్ అయ్యి, క‌నెక్ట్ అయితేనే లాంగ్ ర‌న్ ఉంటుంది. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్లు అదంత సుల‌భం కాదు.

ఆశిష్‌కు అది చాలా పెద్ద టార్గెట్‌. తొలి సినిమాతో త‌న‌ని ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటారోన‌ని ఆస‌క్తి నాకు కూడా ఉంది. ప్రేక్ష‌కులు పాస్ మార్కులు వేసే వర‌కు టెన్ష‌న్ ఉంటుంది. ఉండాల్సిందే. ప్ర‌తి సినిమాకు టెన్ష‌న్ ప‌డ‌తాం. ఈ సినిమాకు ఎక్కువ టెన్ష‌న్ ప‌డుతున్నాం. ఆశిష్‌కు.. హీరో కావాల‌నుకున్న‌ప్ప‌టి నుంచి నువ్వు హీరోగా స‌క్సెస్ అవ్వొచ్చు.. కాక‌పోవ‌చ్చు. కాక‌పోతే ఆల్ట‌ర్ నేటివ్‌గా మ‌రోటి సిద్ధంగా పెట్టుకోవాల‌ని చెబుతూ వ‌స్తున్నాను. అయితే.. త‌ను స‌క్సెస్ అవుతాడ‌ని చాలా గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది. రౌడీ బాయ్స్ సినిమా విషయానికి వ‌స్తే.. ఓ హీరోను ఇంట్ర‌డ్యూస్ చేయాలంటే ఔట్ అండ్ ఔట్ యూత్ మూవీ కావాలి. ప్రెజెంట్ యూత్ ఆడియెన్స్ ఎలాంటి సినిమాను కోరుకుంటున్నారో, అలాంటి సినిమా ఇది. డైరెక్ట‌ర్ హ‌ర్ష ఈ సినిమా క‌థ‌ను అలా ప్రిపేర్ చేశాడు.

హుషారు త‌ర్వాత హ‌ర్ష న‌న్ను క‌లిసిన‌ప్పుడు ఔట్ అండ్ ఔట్ యూత్ కంటెంట్ కావాల‌ని అడిగాను. అప్పుడు త‌ను ఈ పాయింట్ చెప్పి.. క‌థ‌ను డెవ‌ల‌ప్ చేస్తూ వ‌చ్చాడు. సినిమా దాదాపు పూర్త‌య్యింది. అక్టోబ‌ర్‌లో రిలీజ్ అనుకుంటున్నాం. హ‌ర్ష సినిమాను బాగా తీశాడు. సినిమా గురించి ఇప్పుడే ఎక్కువ‌గా చెప్ప‌ను. దేవిశ్రీప్ర‌సాద్‌, మ‌ది వంటి టాప్ టెక్నీషియ‌న్స్ ప‌ని చేశారు. అక్టోబ‌ర్ నెల కోసం వెయిట్ చేస్తున్నాం. ప్ర‌మోష‌న్స్ ను డిఫ‌రెంట్‌గా ప్లాన్ చేస్తున్నాం. స‌క్సెస్‌ఫుల్ సినిమా తీశాన‌ని ప్రొడ్యూస‌ర్‌గా న‌మ్ముతున్నాను. మా బ్యాన‌ర్‌లో ‘శ‌త‌మానం భ‌వ‌తి’, ‘హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే’ సినిమాలు చేసిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్‌ గారి అబ్బాయి విక్ర‌మ్ దీంట్లో ఆశిష్‌కి అపోజిట్ రోల్ చేశాడు. అంద‌రూ చ‌క్క‌గా చేశారు’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్