Friday, March 20, 2026
Homeసినిమావైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న '#అశోక్ గల్లా2' చిత్రం

వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ‘#అశోక్ గల్లా2’ చిత్రం

యంగ్ హీరో అశోక్ గల్లా ప్రస్తుతం తన రెండవ ప్రాజెక్ట్- ‘# అశోక్ గల్లా2’ చేస్తున్నారు.దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం 1గా ఎన్నారై (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె సాగర్ సహ నిర్మాత కాగా నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమా మూడో షెడ్యూల్ తాజాగా వైజాగ్ లో ప్రారంభమైంది. ఈ లెంగ్తీ షెడ్యుల్ లో సాంగ్, ఫైట్, టాకీ పార్ట్ ని షూట్ చేస్తున్నారు. ఈ కీలక షెడ్యూల్ లో టీం అంతా పాల్గొంటున్నారు. ఇటివలే అశోక్ గల్లా పుట్టినరోజు నాడు విడుదల చేసిన ఈ చిత్రం గ్లింప్స్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. ధమాకా చిత్రానికి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన పాపులర్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల కెమెరామెన్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు. ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular