Sunday, February 23, 2025
HomeTrending Newsతెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లు పెంచాలి

తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లు పెంచాలి

జమ్మూ, కాశ్మీర్ సహా తెలుగు రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కశ్మీర్  పర్యటన సందర్భంగా జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు కోసం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సాగుతోందని, అది జరగ్గానే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన నేపథ్యంలో వినోద్ కుమార్ స్పందించారు.

జమ్మూకాశ్మీర్ లతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన జరపాలని వినోద్ కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచాల్సిందేనని ఆయన అన్నారు. ఒకే దేశం, ఒకే చట్టం నినాదాన్ని తెలుగు రాష్ట్రాల్లోకూ వర్తింపజేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. జమ్మూ,కాశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా అసెంబ్లీ సీట్లు పెంచేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసిందని, ఇదే విషయాన్ని అమిత్ షా అధికారికంగా శనివారం ప్రకటించారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్