Friday, September 20, 2024
HomeTrending NewsAstronaut: సిఎం జగన్ ను కలిసిన జాహ్నవి

Astronaut: సిఎం జగన్ ను కలిసిన జాహ్నవి

ఐఐఏఎస్‌ ఫ్లోరిడా, యూఎస్‌ఏ నుండి సైంటిస్ట్‌ వ్యోమగామి అభ్యర్ధిగా సిల్వర్‌ వింగ్స్‌ అందుకున్నపాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. గత ఏడాది జులైలో రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా సీఎం జగన్‌ చేసిన సాయానికి జాహ్నవి, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న జాహ్నవి విజ్ఞప్తి మేరకు ఏవియేషన్‌ శిక్షణకు గత ఏడాది 50 లక్షల రూపాయల సాయాన్ని సిఎం అందించారు.

అమెరికా ఫ్లోరిడాలో కమర్షియల్‌ పైలెట్‌ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్ధిక సాయం చేయాలని జాహ్నవి సిఎంకు నేడు  విజ్ఞప్తి చేసింది.  గ్రామీణ ప్రాంత పేద విద్యార్ధి కలను సాకారం చేసేందుకు ఆర్ధిక సాయం అందిస్తామని జగన్ భరోసా  ఇచ్చారు.

రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు కోనసీమ జిల్లాకు బయలుదేరుతున్న ముఖ్యమంత్రిని… సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ ద్వారా కలుసుకుని తన పరిస్థితిని వివరించారు. దీనికి ముఖ్యమంత్రి అంగీకరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్