No Janvi: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం లైగర్. ఈ సినిమా రిలీజ్ కాకుండానే.. వీరిద్దరూ కలిసి ‘జనగణమన‘ అనే చిత్రాన్ని ప్రారంభించారు. ఇటీవలే అఫిషియల్ గా అనౌన్స్ చేసిన ఈ సినిమా పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్. మహేష్ బాబు, యష్, వెంకటేష్, పవన్ కళ్యాణ్.. ఇలా చాలా మంది దగ్గరకు వెళ్లింది ఈ కథ. ఫైనల్ గా విజయ్ దేవరకొండతో ఫిక్స్ అయ్యింది.
అయితే.. ఈ సినిమాలో విజయ్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అఫిషియల్ గా అనౌన్స్ చేయకపోయినా జాన్వీ ఈ సినిమాలో నటించడం ఫిక్స్ అనుకున్నారు. ఎందుకంటే.. జాన్వీ కపూర్ ఓ ఇంటర్ వ్యూలో విజయ్ తో నటించాలని వుందని చెప్పింది. అందుకే జనగణమనలో జాన్వీ కన్ ఫర్మ్ అంటూ టాలీవుడ్, బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి.
అయితే… పూరి ఎప్పటి నుంచో జాన్వీని టాలీవుడ్ కి పరిచయం చేయాలని ట్రై చేస్తున్నారు కానీ.. కుదరలేదు. తాజా వార్త ఏంటంటే.. జనగణమన సినిమా కోసం క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డేను సంప్రదించారట. విజయ్ సరసన నటించేందుకు పూజా ఓకే చెప్పిందట. ఈ విధంగా జాన్వీ అనుకుంటే.. పూజా సెట్ అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూన్ లేదా జులై నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. మరి.. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన చిత్రంతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.
Also Read : విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్