Sunday, January 19, 2025
Homeసినిమా'విజేత' ఫంక్షన్లో మెగాస్టార్ ను చూసి అలా డిసైడ్ అయ్యాను: రవితేజ  

‘విజేత’ ఫంక్షన్లో మెగాస్టార్ ను చూసి అలా డిసైడ్ అయ్యాను: రవితేజ  

చిరంజీవి కథానాయకుడిగా ‘వాల్తేరు వీరయ్య‘ సినిమా రూపొందింది. మైత్రీ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను రవితేజ చేశారు. అందువలన మెగా ఫ్యాన్స్ తో పాటు మాస్ మహారాజా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో జరిగింది.

ఫీవర్ కారణంగా ఈ ఫంక్షన్ కి శ్రుతి హాసన్ రాలేకపోయింది. ఆ లోటును కేథరిన్ – ఊర్వశి రౌతేలా తీర్చారు. రెడ్ కలర్ డ్రెస్ లో ఊర్వశి ఈ ఫంక్షన్ కి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఈ వేదికపై రవితేజ మాట్లాడుతూ .. ” విజయవాడ నుంచి నా జర్నీ మొదలైంది. అన్నయ్య సినిమాలు ఏవి వచ్చినా మా గ్యాంగ్ అంతా కలిసి ఆ సినిమాకి వెళ్లే వాళ్లం. అక్కడే ‘విజేత’ సినిమా ఫంక్షన్ జరిగింది. అక్కడికి మా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాను .. కానీ అన్నయ్యను దగ్గర నుంచి చూడలేకపోయాను.

ఆ రోజున ఫంక్షన్ లో అన్నయ్య పక్కన కోదండరామిరెడ్డి గారో .. భానుప్రియగారో కూర్చున్నారు. ఏదో ఒక రోజున నేను మెగాస్టార్ పక్కన కూర్చుంటాను అని మా ఫ్రెండ్స్ తో చెప్పాను. అలాంటి ఒక ఆలోచనతో మొదలైన ఆ ప్రయాణం ఈ రోజున ఈ స్టేజ్ వరకూ వచ్చేసింది. నేను ఇప్పుడు అన్నయ్య పక్కన కూర్చోలేదు .. ఏకంగా ఆయన చంకనెక్కేశాను. అంతగా ఆయన ప్రేమాభిమానాలను సంపాదించుకున్నాను. అన్నయ్యతో కలిసి నేను చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్