Saturday, January 18, 2025
Homeసినిమానవంబర్ 12న ‘అతడెవడు’ చిత్రం విడుదల

నవంబర్ 12న ‘అతడెవడు’ చిత్రం విడుదల

Atadevadu Movie Will Be Releasing On November 12th :

ఎస్.ఎల్.ఎస్ సమర్పణలో తోట క్రియేషన్స్ బ్యానర్‌ పై సాయికిరణ్ కోనేరి, వికాసిని, జ్యోతి సింగ్ హీరో హీరోయిన్లుగా వెంకట్ రెడ్డి నంది దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘అతడెవడు’. ఈ చిత్రాన్ని నిర్మాత తోట సుబ్బారావు నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ విలువలతో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 12న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ “ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. టీజర్ చూసిన సినీ ప్రముఖులు ఫోన్ చేసి మరీ అభినందించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనరే కాకుండా యూత్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. చూసిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం” అని తెలిపారు

Also Read :‘మిస్టేక్’ నుంచి ‘గ్రహచారం గంటా’ లిరికల్ సాంగ్ రిలీజ్

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్