Saturday, February 22, 2025
HomeTrending NewsTDP Mahanadu: 15 లక్షల మందితో భారీ సభ: అచ్చెన్నాయుడు

TDP Mahanadu: 15 లక్షల మందితో భారీ సభ: అచ్చెన్నాయుడు

మే 27,28 తేదీల్లో రాజమండ్రి వేదికగా మహానాడును ఘనంగా నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు.  మహానాడు సందర్భంగా ఏర్పాటు చేయతలపెట్టిన భారీ బహిరంగ సభకు పలు ప్రదేశాలను పార్టీ నేతలతో కలిసి అచ్చెన్న పరిశీలించారు. రాజమహేంద్రవరం శివారులోని వేమగిరిలో స్థలాన్ని ఖరారు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా జరుగుతోన్న ఈ పసుపు పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేస్తామని  స్పష్టం చేశారు.

వేడుక నిర్వహణ కోసం 15 కమిటీ లను ఏర్పాటు చేస్తున్నామని, రెండ్రోజుల్లో వాటిని వెల్లడిస్తామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా టిడిపి అభిమానులు వస్తున్నారని, విదేశాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఈసారి రెండు చోట్ల వేదికలు ఉంటాయని, మొదటి రోజు 15 వేల మందితో ప్రతినిధుల సభ జరుగుతుందని, రెండోరోజు 15 లక్షల మందితో భారీ సభ ఉంటుందని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్