Sunday, September 29, 2024
HomeTrending Newsఆర్ధిక మంత్రి కాదు, అప్పుల మంత్రి: అచ్చెన్నాయుడు

ఆర్ధిక మంత్రి కాదు, అప్పుల మంత్రి: అచ్చెన్నాయుడు

జగన్ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. తమ ప్రభుత్వ  హయాంలో క్రమం తప్పకుండ ఒకటో తారీఖున జీతాలు అందజేశామని, ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఎప్పుడు జీతాలు ఇస్తుందో ఎవరికీ అర్ధం కాదు అంటూ వ్యాఖ్యానించారు.

“తెలుగుదేశం ప్రభుత్వంలో నెలలో మొదటి తారీఖున ఉద్యోగుల ఖాతాలలో ఖచ్చితంగా జీతాలు పడేవి. ఈ అసమర్థ ప్రభుత్వం వచ్చాక ఢిల్లీలో అప్పు దొరికితేనే ఏపీలో జీతాలు. బుగ్గన ఇక్కడ కన్నా ఢిల్లీలో ఉండేదే ఎక్కువ. ఏపీలో ఆర్థిక శాఖా మంత్రి అనే పదవి లేదు ఇప్పుడున్నది కేవలం అప్పుల శాఖా మంత్రి మాత్రమే.

5 వ తేదీ వస్తున్నా ఇంకా సగం మంది ఉద్యోగులు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదు. గత ప్రభుత్వంలో అభివృద్ది కోసం కొద్దిగా అప్పు చేసినా నానా యాగీ చేసిన ఇదే ఆర్థిక మంత్రి ఇప్పుడు నిస్సిగ్గుగా జగన్ చేయిస్తున్న లక్షల కోట్ల అప్పులను సమర్థిస్తున్నాడు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్