Frustration: సిఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మే 27,28 తేదీల్లో ఒంగోలులో మహానాడు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఒంగోలులో అచ్చెన్నాయుడు పర్యటించారు. మహానాడు నిర్వహణ కోసం రెండు చోట్ల స్థలాలు పరిశీలించారు. ఏర్పాట్లపై స్థానిక నేతలకు పలు సూచనలు చేశారు. పార్టీ పండుగను విజయవంతం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం జగన్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని, దీన్ని తట్టుకునేందుకు ముందస్తుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అచ్చెన్నాయుడు అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు టిడిపి సిద్ధంగా ఉందని, తమ పార్టీకి 160 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల పీకేతో జగన్ చేయించుకున్న సర్వేలో కూడా వైసీపీకి కేవలం 35 సీట్లు మాత్రమే వస్తాయని తేలిందని, అందుకే సిఎం జగన్ అసహనానికి గురవుతునారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈ పాలనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుదామా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు.
Also Read : రాష్ట్రంలో బుల్డోజర్ వ్యవస్థ: యనమల