రాష్ట్రంలో జెఎంఎం ట్యాక్స్ అమలవుతోందని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరుడు జయరామిరెడ్డి బెదిరింపులే దీనికి నిదర్శనమని అన్నారు. వైసీపీ నేతల తీరు మారకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
జేఎంఎం ట్యాక్స్ లో జె అండ్ జగన్ మోహన్ రెడ్డి, ఎం అంటే మినిస్టర్స్, ఎం అంటే ఎమ్మెల్యేలు అని అచ్చెన్నాయుడు అభివర్ణించారు. కంట్రాక్టర్లను వైసీపీ నేతలు ఈ ట్యాక్స్ కోసం బెదిరిస్తున్నరని, రాష్ట్రంలో పనులు చేయాలంటేనే వారు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. లిక్కర్, ఇసుక, మైనింగ్ పై వచ్చే ఆదాయం సరిపోక ఇప్పుడు కంట్రాక్టర్లపై కూడా పడ్డారని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయని ప్రజలకు చెప్పారని, ప్రస్తుతం రాష్ట్రంలో రహదారులపై వాహనాల చక్రాలు ఊడిపోయేలా పాలన అందిస్తున్నారని విమర్శించారు.