Sunday, January 19, 2025
HomeTrending Newsజగన్ పై దాడి నాటకం: గోరంట్ల వ్యాఖ్యలు

జగన్ పై దాడి నాటకం: గోరంట్ల వ్యాఖ్యలు

ప్రతి ఎన్నికలకు ముందు ఏదో ఒక డ్రామా ఆడటం జగన్ కు అలవాటేనని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. జగన్ డ్రామాలు ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయాయని… సానుభూతి రాదని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి డిజిపి, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజమండ్రిలో బుచ్చయ్య మీడియాతో మాట్లాడారు.

వేలాది మంది పోలీసులతో యాత్ర చేస్తున్నారని, ఎక్కడకు వెళ్ళినా చెట్లు నరికిస్తున్నారని, బారికేడ్లు కట్టించుకుంటున్నారని, ప్రజలకు అందనంత ఎత్తులో నిల్చుని ఉంటున్నారని అలాంటప్పుడు యాత్ర జరుగుతున్న సమయంలో  కరెంట్ తీసేయడం కుట్ర కాకపొతే మరేమిటని ప్రశ్నించారు. జగన్ కుట్రలో భాగంగానే ఈ ఘటన జరిగిందని,… ఎవరో రాయి విసిరారని, హత్య చేయబోయారంటూ ప్రచారం చేసుకుంటూ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో పెద్ద పెద్ద ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయని, ప్రచారం కోసమే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళారని ఎద్దేవా చేశారు.

వివేకా హత్య కేసులో నిందితులను జగన్ కాపాడుతున్నారని, అలాంటి వ్యక్తికి ఎందుకు ఓట్లు వేయాలని… ఆయన చెల్లెళ్ళు షర్మిల, సునీత అడుగుతున్న ప్రశ్నలకు ఎందుకు జగన్ సమాధానం చెప్పడం లేదని అడిగారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్