Sunday, February 23, 2025
HomeసినిమాD-Glamor: అనసూయ అంటే అందం అంతే!

D-Glamor: అనసూయ అంటే అందం అంతే!

అనసూయ బుల్లితెర నుంచి వచ్చింది. అయినా ఒక గ్లామరస్ హీరోయిన్ కి ఉండవలసిన క్రేజ్ ఆమెకి ఉంది. అనసూయ కోసం టీవీ షోస్ చూసేవాళ్లే కాదు .. ఆమె కోసం సినిమాలకి వెళ్లేవారు కూడా ఉన్నారు. అనసూయకి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఏ పాత్రను పోషించినా  మెప్పించగల సామర్థ్యం ఆమెకి ఉంది. స్పెషల్ సాంగ్స్ లో మెరిసినా .. డాబు – దర్పం కలిగిన పాత్రలను పోషించినా .. ఆమె తన మార్క్ చూపిస్తూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే కొంతమంది హీరోయిన్స్ గ్లామర్ కూడా ఆమె ముందు తేలిపోతుంటుంది.

అయితే తాను గ్లామరస్ గా ఉంటానని చెప్పి ఆ తరహా పాత్రలను మాత్రమే చేస్తూ ఆమె వెళ్లడం లేదు. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేస్తూ వెళుతోంది. పాత్ర కోసం డీ గ్లామర్ గా కనిపించడానికి కూడా ఆమె వెనకాడటం లేదు. అయితే అనసూయను డీ గ్లామర్ గా చూపించడం అన్నిటికంటే కష్టమైన విషయంగానే చెప్పుకోవాలి. ‘విమానం’ సినిమాలో ఆమె ‘సుమతి’ పాత్రను పోషించింది. స్లమ్ ఏరియాకి సంబంధించిన డీ గ్లామర్ రోల్ అది. నటన పరంగా వంక బెట్టలేకపోయినా, ఆ పాత్ర ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. అందుకు కారణం ఆ నేపథ్యానికి .. ఆమె గ్లామర్ కి సెట్ కాకపోవడమే.

ఇక నిన్న ‘జీ 5’లో అనసూయ కీలకమైన రోల్ ను పోషించిన ‘ప్రేమ విమానం’ సినిమా స్ట్రీమింగ్ అయింది. ఈ కథలో మెయిన్ ట్రాక్ లోనే అనసూయ పాత్ర కనిపిస్తుంది. పల్లెటూరు .. పేద కుటుంబం .. పిల్లలను పోషించుకోవడానికే కష్టపడే ‘శాంత’ పాత్ర ఆమెది. అయితే అంత పేదరికం కలిగిన ఆ పాత్రలో అనసూయని డీ గ్లామర్ గా చూపించడానికి చాలా కష్టపడ్డారు. ఈ తరహా పాత్రలో చేయడానికి అనసూయ ముందుకు రావడం అభినందనీయమే. కానీ ఈ పాత్ర కూడా ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు.  డీ గ్లామర్ రోల్స్ చేయడానికి అనసూయ ఎందుకు? అనే టాక్ మాత్రం ఆడియన్స్ వైపు నుంచి వినిపిస్తూనే ఉంది. అనసూయను గ్లామరస్ గా చూడటానికే ఆడియన్స్ ఆసక్తిని కనబరుస్తున్నారనేది మాత్రం వాస్తవం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్