Wednesday, September 25, 2024
Homeసినిమా'ఆదిపురుష్' త్రీడీ టీజర్ స్క్రీనింగ్ కు విశేష స్పందన

‘ఆదిపురుష్’ త్రీడీ టీజర్ స్క్రీనింగ్ కు విశేష స్పందన

ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ఇతిహాసిక చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా త్రీడీ వెర్షన్ టీజర్ ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 60 థియేటర్లలో రిలీజ్ చేశారు.  త్రీడీ ఫార్మేట్ లో తీజర్ చూసిన ప్రేక్షకులు అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు.

ఇటీవల టీజర్ ను అయోధ్య నగరంలో విడుదల చేసిన టీమ్..త్రీడీ వెర్షన్ టీజర్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రభాస్ అండ్ మూవీ టీమ్… ప్రేక్షకులు, అభిమానుల కోసం పలు థియేటర్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ చేసింది. ఈ స్క్రీనింగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఆదిపురుష్ చిత్రాన్ని పౌరాణిక గాథ రామాయణం నేపథ్యంతో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు.

టీ సిరీస్, రెట్రోపైల్స్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మాణంలో భాగమయ్యారు. కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఐమాక్స్, త్రీడీ పార్మేట్ లో సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

Also Read : ఆదిలోనే హింసపాదు

RELATED ARTICLES

Most Popular

న్యూస్