Sunday, January 19, 2025
Homeసినిమా‘థాంక్యూ’ న్యూపిక్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

‘థాంక్యూ’ న్యూపిక్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

Thank You! మ‌జిలీ, వెంకీమామ‌, ల‌వ్ స్టోరీ, బంగార్రాజు.. ఇలా వ‌రుస‌గా విజ‌యాలు సాధించి కెరీర్ లో దూసుకెళుతోన్న యంగ్ హీరో నాగ‌చైత‌న్య‌. ప్ర‌స్తుతం థాంక్యూ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా ఎప్పుడో కంప్లీట్ అయ్యింది కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ కాలేదు. సరైన అప్ డేట్ లేదు.

దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుంది? అని సోష‌ల్ మీడియాలో అభిమానులు  ఆరా తీస్తున్నారు. దీంతో ఈ సినిమా గురించి ఏ అప్ డేట్ ఇవ్వాలో మేక‌ర్స్ కి తెలియ‌లేదో ఏమో కానీ.. వ‌ర్కింగ్ స్టిల్ ను అఫిషియ‌ల్ గా రిలీజ్ చేశారు. ఈ పిక్ లో చైత‌న్య‌ ఫోన్‌ చూస్తుండగా, రాశీఖన్నా ఎవ‌రితోనో మాట్లాడుతున్న‌ట్టుగా క‌నిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య హాకీ ప్లేయర్‌గా కనిపించ నున్నారు. అవికాగోర్, మాళ‌వికా నాయ‌ర్‌లు కీల‌క‌పాత్ర‌లు పోషించారు. మ‌రి.. థాంక్యూ మూవీతో కూడా నాగచైత‌న్య‌ స‌క్సెస్ సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

Also Read : అక్కినేని నాగ‌చైత‌న్య ‘థాంక్యూ’ చిత్రీకరణ పూర్తి

RELATED ARTICLES

Most Popular

న్యూస్