Saturday, January 18, 2025
HomeTrending Newsసోమవారం నుంచి మందు పంపిణి

సోమవారం నుంచి మందు పంపిణి

ఆనందయ్య మందు తయారీ రేపటి నుంచి ప్రారంభం కానుంది. వచ్చే సోమవారం నుంచి పంపిణీ చేస్తారు. మందు పంపిణీ కోసం నెల్లూరుకు చెందినా శేశ్రిత టెక్నాలజీ సంస్థ ఓ ప్రత్యేక వెబ్ సైట్ రూపొందిస్తోంది.

కాగా, మందు తయారీకి కావాల్సిన మూలికలు, ఔషధాలు అందించాల్సిందిగా ఆనందయ్య విజ్ఞప్తి చేశారు. గిరిజన కార్పోరేషన్ నుంచి తేనే సరఫరా చేసేందుకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు  హామీ ఇచ్చారు.

వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేసుకున్న వారికి బ్లూ డార్ట్ కొరియర్ ద్వారా పంపిణీ చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. కృష్ణపట్నం లో కేవలం మందు తయారీ మాత్రమే ఉంటుందని. పంపిణీ ఉండబోదని ఆనందయ్య మరోసారి స్పష్టం చేశారు. కృష్ణపట్నం లోని ఆనందయ్య ఇంటి నుంచి తయారీ ప్రదేశాని సివిఆర్ అకాడమీ కి మార్చారు. వెబ్ సైట్ తో పాటు యాప్ ను కూడా రూపొంది స్తున్నారు. వెబ్, యాప్ లను అధికారికంగా రేపు విడుదల చేస్తారని తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్