Sunday, February 23, 2025
HomeTrending Newsపబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా జనార్ధన్ రెడ్డి

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా జనార్ధన్ రెడ్డి

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి డా. బి.జనార్ధన్ రెడ్డిని ముఖ్యమంత్రి కెసియార్ నియమించారు. చైర్మన్ తో పాటు ఏడుగురు సభ్యులను కూడా ఎంపిక చేశారు. సభ్యులుగా రామావత్ ధన సింగ్, బి. లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, సుమిత్ర ఆనంద్, కారం రవీందర్ రెడ్డి, డా. ఆరవెల్లి చంద్ర శేఖర్ రావు, ఆర్. సత్యనారాయణలను నియమితులయ్యారు.

సమర్ధుడైన ఐఏఎస్ అధికారిగా పేరు సంపాదించిన జనార్ధన్ రెడ్డి జిహెచ్ఎంసి కమిషనర్ గా, విద్యాశాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్నారు. రామావత్ ధన సింగ్ పబ్లిక్ హెల్త్ శాఖలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారు. కారం రవీందర్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేశారు, ఎన్జీఓ అధ్యక్షుడిగా పనిచేశారు. సుమిత్ర ఆనంద్ తెలుగు భాషా పరిశోధకురాలు. లింగారెడ్డి భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేశారు. కోట్ల అరుణ కుమారి స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్, ఆరవెల్లి చంద్ర శేఖర్ ఆయుర్వేద వైద్య నిపుణులు… సత్యనారాయణ జర్నలిస్టుగా ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్