Sunday, January 19, 2025
HomeTrending Newsఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు: బాబు లేఖ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు: బాబు లేఖ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా బోగస్ ఓట్లు నమోదు చేశారని, దీనిపై చర్యలు తీసుకువాలని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు అయన లేఖ రాశారు. వైసీపీ నేతలతో అధికారులు కుమ్మకై భారీగా దొంగ ఓట్లు నమోదు చేయించారని ఆరోపిస్తూ, ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ ను ఈ లేఖతో జత చేశారు. బోగస్ ఓట్లను జాబితాలో చేర్చడం వల్లే ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అవుతోందని, ఒకే చిరునామాతో పదుల సంఖ్యలో ఓట్లు ఉన్నాయని కమిషన్ దృష్టికి బాబు తీసుకు వెళ్ళారు.

గతంలో తిరుపతి ఎంపి ఉప ఎన్నికల సందర్భంలోనూ ఇలాగే జరిగిందని, దొంగ ఓట్లపై విచారణ జరపాలన్న సిఈఓ ఆదేశాల్ని జిల్లా కలెక్టర్ ఖాతరు చేయడం లేదని బాబు అభ్యంతరం వ్యక్తంచేశారు. బోగస్ ఓట్లతో ప్రజాస్వామ్య వ్యవస్థకు, ప్రజల హక్కులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాబు కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్