Sunday, January 19, 2025
HomeTrending NewsAP Politics: బాబు సొంతంగా నడవలేరు: పెద్దిరెడ్డి

AP Politics: బాబు సొంతంగా నడవలేరు: పెద్దిరెడ్డి

పొత్తులు చూసి భయపడాల్సిన అవసరం వైఎస్సార్సీపీకి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీ ఎప్పుడూ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. అసలు తాను గెలుస్తాడో లేదో చూసుకోవాలని పవన్ కు సలహా ఇచ్చారు.

వైఎస్సార్సీపీ  చేపట్టిన ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమ నిర్వహణలో అనంతపురం జిల్లా రాష్ట్రం లోనే తొలిస్థానంలో నిలిచింది. గృహ సారథులు  జిల్లాలో మొత్తం 7.79 లక్షల ఇళ్లను సందర్శించారు. ఈ కార్యక్రమ నిర్వహణలో చొరవ చూపించిన సచివాలయ కన్వీనర్లను అభినందిస్తూ జిల్లాలోని 8 నియోజకవర్గాలకు చెందిన 49 మందికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు. రీజినల్ కోర్డినేటర్, మంత్రి పెద్దరెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

చంద్రబాబులా సొంతంగా నడవలేని స్థితిలో తాము లేమని, తాము సొంతంగానే వెళ్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 151 సీట్లకు తగ్గకుండా మళ్ళీ అధికారం చేపడతామని విశ్వాసం వెలిబుచ్చారు. పవన్ కు రాజకీయ నాయకుడి లక్షణాలు లేవని, నేను మాట్లాడే స్థాయి పవన్ కు లేదనుకుంటున్నానని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్