Thursday, March 19, 2026
HomeTrending NewsIT notices: నన్ను అరెస్టు చేస్తారేమో: బాబు అనుమానం

IT notices: నన్ను అరెస్టు చేస్తారేమో: బాబు అనుమానం

రాష్ట్రంలో వ్యవస్థలను అడ్డుపెట్టుకొని అరాచకం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ‘ఒకట్రెండు రోజుల్లో నన్ను అరెస్టు చేసినా చేస్తారు, నామీద దాడి కూడా చేస్తారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  నిప్పులా బతికానని, 45 ఏళ్ళపాటు ఎవ్వరూ ధైర్యం చేసి తన మీద కేసు పెట్టలేకపోయారని,  ఎక్కడా సాక్ష్యాధారాలు కూడా లేవని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా 26 ఎంక్వైరీలు వేసినా కూడా ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.  ఈ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేస్తున్నారని వాళ్ళు తప్పులన్నీ తనమీద పెడుతున్నారని  అన్నారు. అనంతపురం జిల్లా  రాయదుర్గంలో పల్లె ప్రగతి కోసం ప్రజా వేదిక కార్యక్రమం లో పాల్గొన్నచంద్చంరబాబు మీడియాతో మాట్లాడారు.

ఏదో ఒక కంపెనీని తీసుకు వచ్చి తన పేరు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని, కావాలంటే డబ్బులు కూడా ఇస్తామంటూ ఆఫర్ ఇస్తున్నారని బాబు వెల్లడించారు. నాలుగున్నరేళ్లుగా ఇదే పని చేస్తున్నారని… ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్, రాజధాని, అమరావతి ల్యాండ్స్, ఔటర్ రింగ్ రోడ్ లు అంటూ  కేసులు పెట్టారని, ఇప్పుడేమో ఐటి నోటీసులు అంటున్నారని బాబు పేర్కొన్నారు. వారి అవినీతి పత్రికలో రాస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. ఎప్పటికైనా గెలిచేది ధర్మమేనని, అన్నిటినీ ఎదుర్కొంటామని… న్యాయం జరిగే వరకూ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్తం చేశారు. ధర్మం గెలిచే వరకూ తన యాత్ర కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఎన్ని ఎగిరినా చివరకు గెలిచేది ధర్మమే అన్నారు.

జమిలి వస్తే నాలుగు నెలలు, లేకపోతే ఆరు నెలలు మాత్రమే ఈ ప్రభుత్వం ఉంటుందని జోస్యం చెప్పారు. చరిత్రలో ఎన్నడూ చూడని ప్రజాతీర్పును రాబోయే ఎన్నికల్లో చూడబోతున్నారని ధీమా వెలిబుచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular