Saturday, November 23, 2024
HomeTrending Newsమోసం చేయడం బాబుకు అలవాటే: సిఎం జగన్

మోసం చేయడం బాబుకు అలవాటే: సిఎం జగన్

వచ్చే ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబును నమ్మితే పులినోట్లో తల బెట్టడమేనని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సూపర్ 6 పేరిట చంద్రబాబు హామీలు ఇస్తున్నారని,  కానీ ఇవి నెరవేరాలంటే ఏటా లక్షా 40 వేల కోట్లు కావాలని వెల్లడించారు. 8 వేలు పెన్షన్ కూడా ఇస్తామని బాబు అబద్దాలు చెబుతారని కానీ తనకు మోసాలు చేయడం, అబద్దాలు ఆడడం  చేతకాదని… ఏదైనా చేయగలిగిందే చెబుతానని, మోసాలతో పోటీ పడలేనని స్పష్టం చేశారు. సంక్షేమంలో మీ బిడ్డతో పోటీ పడే నాయకుడు దేశంలోనే మరెవరూ లేరన్నారు. 14 ఏళ్ళు సిఎంగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు ఏనాడైనా అవ్వా తాతలకు మేలు చేశారా అని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి లో పెన్షన్ లబ్ధిదారులతో సిఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు.

జగన్ మాట ఇస్తే చేస్తాడని… దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు రూ. 3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మనదేనని… కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఇంత పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో 99 శాతం అమలు చేసి చూపామన్నారు. ప్రతి ఏటా సంక్షేమం కోసం 7౦ వేల కోట్ల రూపాయలు ఖర్హు పెడుతున్నామన్నారు. గతంలో 39 లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చేవ్వారని కానీ తమ ప్రభుత్వం 66 లక్షల 30 వేల మందికి పెన్షన్ ఇస్తోందని వివరించారు. గతంలో పెన్షన్ల కోసం  నెలకు 400 కోరల రూపాయలు మాత్రమే ఖర్చయ్యేదని, తాము నెలకు రెండు వేల కోట్ల రూపాయల చొప్పున అందజేస్తున్నామని చెప్పారు.

వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికీ పెన్షన్ పంపిణీ చేసే విధంగా ఏర్పాటు చేశామని కానీ చంద్రబాబు తన మనుషులతో దాన్ని నిలిపివేయించారని ఆరోపించారు.  తిరిగి అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించే ఫైలు మీదే తొలి సంతకం చేస్తానని పునరుద్ఘాటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్